రవితేజ 'క్రాక్' OTT రిలీజ్..!

July 10, 2020


img

 మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఓ 10 రోజుల షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట. ఈ సినిమనౌ ఓటిటి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ టైంలో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. అందుకే క్రాక్ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఖిలాడి అని టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ ఇయర్ డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మరి రవితేజ క్రాక్ టీజర్ మెప్పించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.




Related Post

సినిమా స‌మీక్ష