రాధేశ్యామ్ వచ్చారు..!

July 10, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు రాధే శ్యామ్ టైటిల్ ఫైనల్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రభాస్, పూజా హెగ్దెల జంట కూడా చాలా బాగుందన్న కామెంట్స్ వస్తున్నాయి. 

బాహుబలితో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేశాడు. ఆ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా తెలుగులో మాత్రం నిరాశపరచింది. ఇక జిల్ సినిమాతో ఆకట్టుకున్న రాధాకృష్ణ తన సెకండ్ మూవీనే ప్రభాస్ తో చేస్తున్నాడు. ఈ సినిమా మొత్తం రోం బ్యాక్ డ్రాప్ లో వస్తుందట. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను 2021లో రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.



Related Post

సినిమా స‌మీక్ష