సూపర్ హిట్ రీమేక్ లో విశ్వక్ సేన్..!

July 09, 2020


img

ఈమధ్య తెలుగు మేకర్స్ మళయాళ సూపర్ హిట్ సినిమాల మీద కన్నేశారు. అక్కడ సినిమా వచ్చి హిట్టు కొట్టింది అంటే చాలు వెంటనే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సితార మరో మళయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొనేసిందట.

ఈ ఇయర్ మొదట్లో మళయాళంలో వచ్చి సూపర్ హిట్ అయిన కొప్పెల సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. మహ్మద్ ముస్తఫా డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చి అలరించింది. లాక్ డౌన్ కు ముందే రిలీజై హిట్ అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలో అందరిని అలరిస్తుంది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ లో లీడ్ రోల్ లో యువ హీరో విశ్వక్ సేన్ ను సెలెక్ట్ చేశారట. హిట్ సినిమాతో హిట్ అందుకున్న విశ్వక్ సేన్ రెండు మూడు ప్రాజెక్టులు సైన్ చేశాడు. మరి మళయాళ రీమేక్ అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

 


Related Post

సినిమా స‌మీక్ష