పవన్, క్రిష్ మరో రెండు టైటిల్స్..!

July 09, 2020


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ డైరక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ పూర్తి కాగానే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న క్రిష్ సినిమా హిస్టారికల్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. సినిమాకు టైటిల్ గా నిన్నటివరకు విరూపాక్ష అని ప్రచారంలో ఉండగా కొత్తగా మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇంతకీ ఆ రెండు టైటిల్స్ ఏంటంటే అందులో ఒకటి బందిపోటు కాగా మరోటి గజదొంగ. టైటిల్ చూస్తుంటే సినిమాలో పవన్ ఓ దొంగ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. క్రిష్ తో మొదటిసారి కలిసి సినిమా చేస్తున్న పవన్ సినిమాతో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష