బుల్లితెరపై సరిలేరు నీకెవ్వరు..!

July 09, 2020


img

సూపర్ స్టార్ మహేష్ కెరియర్ 26వ సినిమాగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పైనే కాదు బుల్లితెర మీద సూపర్ హిట్ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలకు టి.ఆర్.పి రేటింగ్స్ కూడా కాలిక్యులేట్ అవుతాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు శ్రీరామదాసు 24 రేటింగ్, టెంపర్ 23.5 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. వీటి సరసన సరిలేరు నీకెవ్వరు చేరింది. 

మార్చి చివరి వారంలో జెమిని టివిలో టెలికాస్ట్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా 23.4 టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. టి.ఆర్.పి రేటింగ్ లో టాప్ 3లో నిలిచిన మహేష్ మూవీ ఈసారి సెకండ్ టెలికాస్ట్ టైం తో కూడా మంచి రేటింగ్ సాధించింది. ఈసారి 17.4 టి.ఆర్.పి రేటింగ్స్ తో అదరగొట్టింది. కరోనా టైంలో స్టార్ సినిమాలకు టి.ఆర్.పి రేటింగ్స్ కూడా భారీగా వస్తున్నాయని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష