ఆర్జివి అసలు తగ్గట్లేదుగా..!

July 09, 2020


img

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ టైంలో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం అంటూ రెండు వెబ్ మూవీస్ రిలీజ్ చేసిన ఆర్జివి కొత్తగా 12'ఒ క్లాక్ అంటూ ఓ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక అది రిలీజ్ కాకముందే పవర్ స్టార్ అంటూ ఓ సినిమా మొదలుపెడుతున్నా అని ఎనౌన్స్ చేశాడు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు ఆర్జివి. పవర్ స్టార్ టైటిల్ లో గాజు గ్లాసు బొమ్మ ఉంచాడు. అంతేకాదు ఎన్నికల తర్వాత కథ అని ట్యాగ్ లైన్ ఉంచాడు.

పవర్ స్టార్ కు తాను పెద్ద అభిమానిని అంటూనే టార్గెట్ చేసే వర్మ ఈసారి డైరెక్ట్ ఎటాక్ కు దిగాడు. అయితే పవర్ స్టార్ సినిమా ఓ కల్పిత కథ అని.. దీన్ని ఒకవేళ ఎవరితో అయినా పోల్చుకుంటే అది నా తప్పు కాదని అంటున్నాడు. లాజిక్ గా మాట్లాడి అవతల వాళ్లని బురుడి కొట్టించడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చూస్తుంటే పవర్ స్టార్ విషయంలో వర్మ అసలు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేడని చెప్పొచ్చు. 

  


Related Post

సినిమా స‌మీక్ష