మహేష్ కోసం మొదలుపెట్టాడట..!

July 09, 2020


img

కరోనా తీవ్రత పెరుగుతున్న ఇలాంటి టైం లో సినిమాల షూటింగ్ కష్టమే అని భావిస్తున్నారు. ఆల్రెడీ సీరియల్స్, రియాలిటీ షోస్ షూటింగ్  స్టార్ట్ అవగా.. అక్కడ కరోనా కలకలం సృష్టిస్తుంది. అందుకే సినిమాల షూటింగ్ కు మరికొంత టైం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ట్రైల్ షూట్ చేస్తారని ఆ మధ్య హడావిడి చేయగా అది కూడా ఇప్పుడు వద్దని విరమించుకున్నారు.  

ఇదిలాఉంటే ఈ ఖాళీ టైం లో రాజమౌళి తను చేయబోయే నెక్స్ట్ మహేష్ సినిమా కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. మహేష్ తో జేమ్స్ బాండ్ తరహా సినిమా తెరకెక్కించాలని చూస్తున్న రాజమౌళి మహేష్ సినిమా పని మొదలుపెట్టాడని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష