మెగా ఫ్యామిలీ మరో నిర్మాణ సంస్థ..!

July 09, 2020


img

మెగాస్టార్ నుండి మెగా పవర్ స్టార్ రాం చరణ్ వరకు మెగా ఫ్యామిలీ హీరోలు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమాలు తీశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే మెగా ఫ్యామిలీ నిర్మాణ సంస్థ అనే ఫిక్స్ అవ్వొచ్చు. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ అంటూ స్టార్ట్ చేసినా సరే అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇక చిరు రీ ఎంట్రీ టైం లో కోణిదెల ప్రొడక్షన్స్ అంటూ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఖైది నంబర్ 150, సైరా సినిమాలు ఆ నిర్మాణం సంస్థలోనే నిర్మించారు.

ఇక కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఆచార్య సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కుతుంది. అయితే లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీ నుండి మరో కొత్త బ్యానర్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రారంభించారు. ఈ బ్యానర్ లో వెబ్ సీరీస్ లను నిర్మించాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ ఈ బ్యానర్ లో మొదటి వెబ్ సీరీస్ ఫిక్స్ చేశారు. కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ ఆనంద్ రంగ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేస్తున్నారట. ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే ఈ వెబ్ సీరీస్ కాస్ట్ అండ్ క్రూ టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తుంది.  



Related Post

సినిమా స‌మీక్ష