ఆ సినిమా నుండి చరణ్ పాత్ర తీసేశారా..?

July 08, 2020


img

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఓ ఇంపార్టెంట్ రోల్ లో చరణ్ కనిపిస్తాడని అన్నారు.

అసలైతే ఆ పాత్ర కోసం ముందు మహేష్ ను అనుకున్నారని.. మహేష్ సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించడంతో చరణ్ తోనే ఆ రోల్ చేయించాలని అనుకున్నాడు కొరటాల శివ. అయితే ఇప్పుడు చరణ్ తో కాకుండా ఆ పాత్రని కూడా చిరుతో చేయించేలా ప్లాన్ చేస్తున్నారట. ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తయ్యే వరకు చరణ్ వేరే సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే చరణ్ కోసం వెయిట్ చేస్తే సినిమా లేట్ అవుతుందని మెగాస్టార్ తోనే ఆ పాత్రని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష