ప్రభాస్ 20 మ్యూజిక్ డైరక్టర్ ఫిక్స్

July 08, 2020


img

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా సాహో. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా జులియస్ పకియమ్ ను ఫైనల్ చేశారు. బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న జులియస్ పకియమ్ 2006 కాబుల్ ఎక్స్ ప్రెస్ నుండి ఈ ఇయర్ మొదట్లో వచ్చిన భాగి 3 వరకు సెన్సేషనల్ మ్యూజిక్ అందించాడు.

ధూమ్ 3, ఎక్ థా టైగర్, టైగర్ జిందాహై, భారత్, బజరంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్ వంటి సినిమాలకు జులియస్ పకియం మ్యూజిక్ అందించారు. ప్రభాస్ సినిమాకు ఈ మ్యూజిక్ డైరక్టర్ పనిచేయడం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు రాధే శ్యామ్ టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఫస్ట్ ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష