ఎన్.టి.ఆర్, మనోజ్ కొట్లాట నిజమేనా..!

July 03, 2020


img

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రాబోయే ఈ సినిమాలో హీరో పాత్రలానే విలన్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. మొదటిసారి తన సినిమాలో విలన్ ను సరికొత్తగా చూపించాలని ఫిక్స్ అయ్యాడు త్రివిక్రం. అందుకే ఆ పాత్రకు సమౌజ్జీలుగా ఉండే నటులను ఎంపిక చేసుకుంటున్నాడట.

ఈ క్రమంలో తారక్ తో కొట్లాడేందుకు మంచు హీరో మనోజ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. మంచు మనోజ్ తారక్ తో ఢీ కొడితే ఆ ఫ్రేం అదిరిపోతుంది. ఎన్.టి.ఆర్ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ ఆఫర్ టెంప్ట్ చేసేలా ఉన్నా కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్న మనోజ్ కు ఈ ఆఫర్ షాకింగ్ గా ఉన్నా అతను ఓకే చేస్తాడా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష