సౌత్ లో మహేష్ బాబు ఒక్కడే..!

July 03, 2020


img

సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. సౌత్ లో అందరికన్నా హయ్యెస్ట్ ట్విట్టర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మహేష్ 10 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ అయ్యాడు. సౌత్ లో ఎంతోమంది స్టార్స్ ఉండగా మహేష్ మాత్రమే ఈ అరుదైన రికార్డ్ అందుకున్నాడు. కేవలం తెలుగు సినిమాలే చేసినా మహేష్ కు నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది.

ఇక మహేష్ తర్వాత 9.1 మిలియన్ ఫాలోవర్స్ తో కోలీవుడ్ హీరో ధనుష్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అంతకుముందు ధనుష్ సౌత్ లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ సాధించి ముందుడగా అతన్ని క్రాస్ చేసి మహేష్ ఇప్పుడు కొత్త రికార్డ్ నెలకొల్పాడు. సౌత్ లో మహేష్ బాబు స్టామినా ఏంటన్నది ట్విట్టర్ రికార్డ్ ద్వారా మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష