'V' విషయంలో నాని అప్సెట్..!

July 02, 2020


img

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ V. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ ఇయర్ మార్చి 25 ఉగాది సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రిలీజ్ టైం లోనే కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించగా రిలీజ్ వాయిదా పడ్డది. 

మూడు నెలలు లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఇప్పటికి తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే నాని మాత్రం ఈ సినిమాను ఎలాగైనా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చెప్పాడట. ఆలస్యం అయినా థియేటర్లు ఓపెన్ అయ్యాకనే వి ని రిలీజ్ చేయాలని సూచించాడట. అహాతో పాటుగా అమేజాన్ కూడా వి సినిమా 30 కోట్ల పైగా ఆఫర్ ఇస్తున్నారట. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా నాని వి టీం మాత్రం సినిమాను ఓటిటిల్ రిలీజ్ కు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెబుతున్నారట.



Related Post

సినిమా స‌మీక్ష