చిరు సినిమాలో జగ్గుభాయ్..!

July 02, 2020


img

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. ఈ సినిమాను సాహో డైరక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో జగపతి బాబు నటిస్తున్నాడని తెలుస్తుంది. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా కెరియర్ లో కొత్త టర్న్ తీసుకున్నాడు.

ఆ సినిమా నుండి విలన్ గా మళ్లీ కెరియర్ లో బిజీ అయిన జగపతి బాబు హీరోకి తండ్రి పాత్రల్లో కూడా మెప్పిస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన జగపతి బాబు త్వరలో తెరకెక్కే లూసిఫర్ రీమేక్ లో కూడా మంచి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈమధ్య విలన్ గా కూడా అవకాశాలు అందుకోని జగ్గుభాయ్ ఇప్పుడిప్పుడే మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష