మహేష్ తో రాజమౌళి.. మరో రెండేళ్లు వెయిటింగ్ తప్పదా..?

July 02, 2020


img

సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఎన్నాళ్ల నుండో తెలుగు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. వీళ్ల కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. రాజమౌళి కూడా ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 

ఈ ఇద్దరు వారు కమిటైన సినిమాలు పూర్తి చేసి వారి కాంబో సినిమా చేస్తారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ సినిమానే చేసే ఛాన్స్ ఉన్నా మహేష్ మాత్రం సర్కారు వారి పాట తర్వాత మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ రిలీజ్ హంగామా తర్వాత ఎలా లేదన్నా 3 నుండి 6 నెలలు రెస్ట్ తీసుకుంటాడు. ఆలోగా సర్కారు వారి పాట రిలీజ్ చేసి ఆ గ్యాప్ లో మరో సినిమా కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు. సో ఎలా లేదన్నా రాజమౌళి, మహేష్ సినిమా చేయాలంటే 2022 వరకు పట్టేలా ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష