చిన్న సినిమాలతో 'ఆహా' డీల్

July 02, 2020


img

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది. అందుకే ఆయన అప్పటికి ఇప్పటికి సూపర్ అనేస్తారు. ఇక మారుతున్న ప్రేక్షకుల ఆలోచన విధానం ప్రకారం థియేటర్ కు వచ్చి సినిమా చూసే ఆడియెన్స్ సంఖ్య తగ్గుతుందని కనిపెట్టిన అల్లు అరవింద్. అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లానే ఆహా అంటూ ఓ ఓటిటి యాప్ మొదలుపెట్టాడు. మైహోం రామేశ్వర రావు భాగస్వామ్యంతో ఆహా ఓటిటి మొదలుపెట్టారు అల్లు అరవింద్. 

అమేజాన్, నెటిఫ్లిక్స్ లకు పోటీ ఇచ్చేందుకు ఆహాని రెడీ చేస్తున్నారు. ఇక కరోనా వల్ల థియేటర్లు ఇప్పుడప్పుడే తెరచుకునే అవకాశం కనిపించడం లేదు అందుకే మీడియం, మినిమం బడ్జెట్ సినిమాలు ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 20 సినిమాలను కొనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే మొదలైన తక్కువ టైం లోనే కోటి వ్యూయర్ షిప్ సాధించి డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద సక్సెస్ అయిన ఆహా ఈ సినిమాలన్ని కొని ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష