ఆ నిర్మాణ సంస్థ కొరటాల శివని వదలట్లేదు..!

July 01, 2020


img

యూఎస్ లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేసి సినిమాల మీద ఒక అవగాహన ఏర్పరచుకున్న మైత్రి మూవీ మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు సినిమాతో ప్రొడక్షన్ లోకి దిగారు. స్టార్ సినిమాకు కంటెంట్ బలం ఉంటే ఎలా ఉంటుందో చూపించిన సినిమా అది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ మొదటి సినిమానే సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వరుస స్టార్ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ వచ్చారు. అయితే కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మాత్రం సక్సెస్ అయ్యాయి. 

మరోసారి కొరటాల శివతో మైత్రి మేకర్స్ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరో ఎవరన్నది తెలియదు కాని మైత్రి మూవీ మేకర్స్ కొరటాల శివ కన్ఫర్మ్ అంటున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ మహేష్ తో సర్కారు వారి పాట.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా సెట్స్ మీద ఉంది.     

 


Related Post

సినిమా స‌మీక్ష