ప్రభాస్ 20లో భళ్లాలదేవ..?

June 29, 2020


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాహుబలి భళ్లాలదేవ ఉండబోతున్నాడని తెలుస్తుంది. ఏంటి మళ్లీ ప్రభాస్, రానా ఒకేతెర మీద కనిపిస్తారా అంటే అవుననే అంటున్నారు. ప్రభాస్ సినిమాలో రానా ఓ స్పెషల్ కెమియో రోల్ చేస్తున్నాడట. 

చేసేది చిన్న పాత్రే అయినా రానా తన మార్క్ చూపించడం గ్యారెంటీ అంటున్నారు. ప్రభాస్ 20వ సినిమా టైటిల్ గా రాధే శ్యాం, ఓ డియర్ పరిశీలణలో ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్, రానా కలిసి మరో మల్టీస్టారర్ చేయాలని అనుకున్నా సరైన కథ దొరకలేదు. మరి రాబోతున్న ప్రభాస్ సినిమాలో రానా ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష