పుష్పలో పాయల్ రాజ్ పుత్..!

June 29, 2020


img

అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ మూవీ పుష్ప. రంగస్థలం తర్వాత సుకుమార్ అసలైతే మహేష్ తో సినిమా చేయాల్సి ఉన్నా మహేష్ తో సినిమా అంటే మరో వన్ ఇయర్ లేట్ అవుతుందని భావించి వెంటనే అల్లు అర్జున్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. కేవలం తెలుగులో కాదు ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతులాని అడిగారని వార్తలు వచ్చాయి.

ఊర్వశి చేయనన్నదో లేక ఆమె భారీ రెమ్యునరేషన్ అడిగిందో ఏమో కాని ఆమె ప్లేస్ లో ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మాములుగా సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆర్య నుండి రంగస్థలం వరకు తన ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తూ వచ్చిన సుకుమార్ పుష్పలో కూడా అదరగొట్టే ఐటం సాంగ్ ఫిక్స్ చేశాడట. ఈ సాంగ్ కు తగినట్టుగా పాయల్ అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష