ఆచార్యలో చిరు డ్యుయల్ రోల్..!

June 29, 2020


img

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎక్సయిటింగ్ కు గురిచేస్తుంది. ఆచార్య సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక పాత్ర కొరటాల మార్క్ సామాజిక మార్పు కోసం పాటుపడే పాత్ర అని తెలుస్తుండగా.. మరో పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. 

ఈ సినిమాలో రాం చరణ్ కూడా ఒక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. చిరు చేసేది ద్విపాత్రాభినయం అని తెలిసిన మెగా ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివ ఆచార్యతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.Related Post

సినిమా స‌మీక్ష