తమన్నాతో టాక్ షో.. ఆహా ప్లాన్ అదిరిందిగా..!

June 29, 2020


img

దశాబ్ధకాలంపైగా హీరోయిన్ గా కొనసాగుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికి వరుస ఛాన్సులతో సత్తా చాటుతుంది. లాస్ట్ ఇయర్ ఎఫ్-2తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న తమన్నా ప్రస్తుతం గోపిచంద్ హీరోగా చేస్తున్న సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటుగా ఆహా కోసం ఓ టాక్ షో చేస్తుందట తమన్నా.

అల్లు అరవింద్ సారధ్యంలో నడుస్తున్న ఆహా ఓటిటికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ లాక్ డౌన్ టైం ఆహాకి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇంకాస్త సబ్ స్క్రైబర్స్ పెంచుకునేందుకు తమన్నాతో స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారట. అందులో మొదటి ఎపిసోడ్ లో రాం చరణ్, అల్లు అర్జున్ లు గెస్ట్ గా వస్తారని తెలుస్తుంది. మొత్తానికి అల్లు అరవింద్ ప్లాన్ అదిరిపోగా తమన్నా ఆ షోతో అదరగొట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష