రవితేజ సొంత బ్యానర్..!

June 27, 2020


img

మాస్ మహరాజ్ రవితేజ సొంత నిర్మాణ సంస్థని ఏర్పాటు చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న పాత్రల నుండి హీరోగా ఎదిగిన రవితేజ స్వయంకృషితో పైకొచ్చిన ఆయన ప్రతిభ ఎప్పటికి మెచ్చుకోదగినదే. మాస్ ఆడియెన్స్ ఇష్టమే మాస్ రాజా రవితేజ ఈమధ్య కెరియర్ లో కొద్దిగా వెనకపడ్డ రవితేజ మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ.

ఇదేకాకుండా రమేష్ వర్మ డైరక్షన్ లో కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత రవితేజ సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చేలా రవితేజ నిర్మాణ సంస్థ ఏర్పాటుచేస్తున్నట్టు టాక్. తన ప్రొడక్షన్ లో తన సినిమాలతో పాటుగా ఇతర హీరోల సినిమాలు కూడా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. మరి రవితేజ సొంత బ్యానర్ కు సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.Related Post

సినిమా స‌మీక్ష