'చక్ర' ట్రైలర్ అదిరిందిగా..!

June 27, 2020


img

తెలుగు వాడే అయినా తమిళంలో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విశాల్ తన ప్రతి సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఈమధ్య వరుస హిట్లతో దూసుకెళ్తున్న విశాల్ లేటెస్ట్ గా చక్ర సినిమాతో వస్తున్నాడు. విశాల్ నిర్మాతగా ఆనందన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చక్ర. ఈమధ్య టీజర్ తో అలరించిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు.. వైర్ లెస్ నెట్ వర్క్ కూడా ప్రమాదకరమే.. వెల్ కం టూ డిజిటల్ ఇండియా అంటూ విలన్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ ఒక్కటి చాలు ఈ సినిమా కథ ఏంటన్నది చెప్పడానికి. ఈ సినిమాలో రెజినా, శ్రద్ధ శ్రీనాథ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

మిలిటరీ ఆఫీసర్ అయిన విశాల్ హ్యాకర్స్ పనిపట్టే కథతో చక్ర వస్తుంది. హ్యాకింగ్ ద్వారా బ్యాంకులను ఎలా కాజేస్తున్నారు.. హ్యాకార్స్ సిస్టెం ను ఎలా నాశనం చేస్తున్నారు అన్న కథతో ఈ సినిమా వస్తుంది. అంతకుముందు విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది. ఇప్పుడు హ్యాకింగ్ మీద చక్ర సినిమా చేస్తున్నాడు. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.   

Related Post

సినిమా స‌మీక్ష