ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ ఎవరితో..?

June 27, 2020


img

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్, త్రివిక్రం సినిమాలు చేస్తాడని తెలుస్తుంది. ముందు త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా ఉంటుందని వార్తలు రాగా ఈలోగా కెజిఎఫ్ డైరక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమానే నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాడు ఎన్.టి.అర్.

ఇక చరణ్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇద్దరు హీరోలు తమ నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీ కానున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ ప్లాన్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.Related Post

సినిమా స‌మీక్ష