ఆ వయసులోనే మేగజైన్ కవర్ పేజ్ పై రష్మిక..!

June 05, 2020


img

రష్మిక పుట్టకతోనే స్టార్ అయ్యిందా.. ఆమె చిన్నప్పుడే సెలబ్రిటీగా మారిందా.. అంటే అవుననే చెప్పుకోవాలేమో. అలా ఎందుకు అంటే.. లేటెస్ట్ గా అమ్మడు తన చిన్నప్పటి కవర్ పేజ్ ఫోటోతో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోకులం మేగజైన్ కోసం రష్మిక 2001లో ఇచ్చిన స్టైల్ అది. రష్మికకు మహా అంటే ఐదేళ్లు ఉండొచ్చు.. అప్పుడే మేగజైన్ కోసం క్యూట్ స్టైల్ ఇచ్చింది రష్మిక. అమ్మడు షేర్ చేసిన ఈ పోస్ట్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఇప్పుడే కాదు అప్పుడు రష్మిక స్టారే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఈ ఇయర్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న మహేష్ ఆ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పలో ఛాన్స్ అందుకుంది. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీతో పాటుగా మరో ఇద్దరి స్టార్స్ తో జత కట్టబోతుందట రష్మిక. అందులో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో మూవీ కూడా ఉందని టాక్.  



Related Post

సినిమా స‌మీక్ష