ఆ ఇద్దరి దర్శకులతో మెగా ప్రిన్స్..!

June 05, 2020


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు.. గద్దలకొండ గణేష్ హిట్ తో నటుడిగా తన సత్తా చాటిన వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రెండు పెద్ద ప్రాజెక్టులు చేసే ఆలోచనలో ఉన్నాడు వరుణ్ తేజ్. అందులో ఒకటి సురేందర్ రెడ్డి డైరక్షన్ లో కాగా.. మరొకటి క్రిష్ డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ క్రిష్ తో కంచె సినిమా చేసిన వరుణ్ తేజ్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. 

సైరా నరసింహా రెడ్డి తర్వాత ప్రభాస్ కోసం ప్రయత్నించినా సురేందర్ రెడ్డి ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాదని తెలియడంతో వరుణ్ తేజ్ తో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. ప్రభాస్ కథతోనే వరుణ్ తేజ్ తో చేస్తాడా లేక వరుణ్ కోసం వేరే కథ సిద్ధం చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఎఫ్-2, గద్దలకొండ గణేష్ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో మంచి జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాతో కూడా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ మూవీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. 



Related Post

సినిమా స‌మీక్ష