తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్నారా..?

June 05, 2020


img

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తన 60వ సినిమా క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. కార్తీక్ సుబ్బరాజు డైరక్షన్ లో విక్రమ్ నటించబోయే ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. విక్రం, ధృవ్ క్రేజీ మల్టీస్టారర్ గా ఈ మూవీ రాబోతుందట. ఆల్రెడీ ఆదిత్య వర్మ సినిమాతో సత్తా చాటిన ధృవ్ రెండో సినిమానే మల్టీస్టారర్ గా చేస్తున్నాడు. ఎలాగైనా తనయుడి కెరియర్ సెట్ చేసే పనిలో పడ్డ విక్రమ్ అతనితో కలిసి ఈ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. 

రజినీకాంత్ తో పేట సినిమా చేసిన కార్తీక్ సుబ్బరాజు ప్రస్తుతం ధనుష్ తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే విక్రమ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తన మార్క్ హిట్ అందుకోవడంలో వెనుకపడ్డ విక్రమ్ తనయుడితో కలిసి తను కూడా హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా కార్తీక్ సుబ్బరాజు డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నారు. విక్రమ్ ఆ సినిమాను తమిళంలో చేసినా తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష