రోజాని విలన్ చేస్తున్నారా..?

June 03, 2020


img

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని తెలిసిందే. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తెరకెక్కే ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలు కానుంది. ఈ సినిమాకు సంబందించిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

బన్నీ సినిమాలో విలన్ గా రోజా నటిస్తుందని లేటెస్ట్ టాక్. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా అటు సినిమాలు, టివి షోలతో పాటుగా పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్నారు. తనకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తున్న రోజా అల్లు అర్జున్ పుష్పాలో విలన్ గా చేస్తుందో లేదో చూడాలి. రోజా నిజంగానే విలన్ గా చేస్తే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే. Related Post

సినిమా స‌మీక్ష