రోజా సీక్వల్ చేస్తే హీరో అతనేనా..?

June 03, 2020


img

మణిరత్నం డైరెక్ట్ చేసిన రోజా సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. అరవింద స్వామీ, మధుబాల జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. కొన్నాళ్లుగా మణిరత్నం ఆ సినిమాకు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నా వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా రోజా 2 కథ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా పూర్తి కాగానే రోజా 2 సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. 

రోజా తీస్తే మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసే అవకాశాలు ఉన్నాయట. మణిరత్నం రోజా 2 సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారట. తెలుగు, తమిళ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ కు మంచి ప్రేక్షకాదరణ ఉంది. అందుకే మమ్ముట్టి తనయుడితోనే తన సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడు మణిరత్నం. మరి ఈ సినిమాలో హీరోయిన్ గ ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష