డైరక్టర్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్

June 03, 2020


img

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీతో హిట్ అందుకున్న సుజిత్ తన నెక్స్ట్ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్క్ కాకున్నా సరే ఈ కుర్ర డైరక్టర్ కు సూపర్ ఛాన్సులు వస్తున్నాయి. ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న లూసిఫెర్ రీమేక్ ను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు టాక్. 

ఇదిలాఉంటే ఈ గ్యాప్ లో తన పెళ్లి వార్తతో సర్ ప్రయిజ్ చేస్తున్నాడు సుజిత్. ప్రవల్లికతో సుజిత్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. జూన్ 10న ఎంగేజ్మెంట్ జరుగనుందని తెలుస్తుంది. తీసిన రెండు సినిమాలతోనే డైరక్టర్ గా తన సత్తా చాటిన సుజిత్ మెగాస్టార్ మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఆల్రెడీ మలయాళంలో హిట్టైన సినిమాను సుజిత్ తెలుగులో ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష