వెంకటేష్ తో పూరి.. అదిరిపోయే కాంబినేషన్ గురూ..!

June 02, 2020


img

విక్టరీ వంకటేష్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కలిసి సినిమా చేస్తే.. ఇన్నేళ్ల కెరియర్ లో వెంకటేష్.. ఇన్ని సినిమాల అనుభవంలో పూరి జగన్నాథ్ ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అప్పట్లో ఈ కాంబో సెట్ చేయాలని ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. లేటెస్ట్ గా మరోసారి పూరి, వెంకీ కాంబో మూవీపై వార్తలు వస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్టు అందుకున్న పూరి తన నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నాడు. 

ఈ సినిమా తర్వాత పూరి బాలకృష్ణ, వెంకటేష్ లలో ఒకరితో సినిమా చేస్తాడని అంటున్నారు. బాలయ్య బాబుతో ఆల్రెడీ పైసా వసూల్ సినిమా చేసిన పూరి మరో సినిమాకు రెడీ అవుతున్నాడట. అంతేకాదు వెంకటేష్ ను మెప్పించే కథ ఒకటి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. విజయ్ సినిమా పూర్తయ్యాక వెంకటేష్ ను కలిసి కథ వినిపించాలని చూస్తున్నాడు. అదే జరిగితే ఈ కాంబినేషన్ సినిమా సెన్సేషనల్ అవుతుందని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష