చదువులోనూ సమంత టాపే

June 02, 2020


img

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కేవలం నటనలోనే నంబర్ 1 కాదు చదువులో కూడా నంబర్ 1 అని తెలుస్తుంది. ఆమె చదువుకున్న డిగ్రీ మార్క్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన సమంతకు అన్నిటిలో మంచి మార్కులే వచ్చాయి. కొందరు చదువు అబ్బక సినిమాల్లో వచ్చారని అంటుంటారు. కానీ సమంత సినిమాలు చేయకపోయినా మంచి పొజిషన్ లో ఉండేదని ఈ మార్క్ షీట్ చూస్తేనే తెలుస్తుంది. 

ఇక పెళ్లి తర్వాత కూడా సమంత తన సత్తా చాటుతుంది. జాను సినిమా తర్వాత తెలుగులో సినిమా ఏది ఒప్పుకొని సామ్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటిస్తుంది. అందులో సమంత విలన్ పాత్రలో నటిస్తుందని అంటున్నారు. మొత్తానికి సినిమాలతో సత్తా చాటుతున్న సమంత ఇక ఇప్పుడు వెబ్ సీరీస్ లతో కూడా అదరగొట్టాలని చూస్తుంది. మరి సమంత చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష