మరో బయోపిక్ రిజెక్ట్ చేసిన నిత్యా..!

June 02, 2020


img

ఈమధ్య ఆఫర్లు లేక కెరియర్ లో పూర్తిగా వెనుకపడ్డ మళయాళ భామ నిత్యా మీనన్ వచ్చిన అరకొర అవకాశాలను కూడా కాదనుకుంటుందని తెలుస్తుంది. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సినిమాలో నాగ్ అశ్విన్ ముందు నిత్యా మీనన్ ను తీసుకోవాలని అనుకున్నాడట కానీ ఆమె చేయనని చెప్పడంతో ఆ ఛాన్స్ కీర్తి సురేష్ అందుకుంది. ఆ సినిమాతో కీర్తి సురేష్ నేషనల్ అవార్డు సైతం దక్కించుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ చేసింది. 

ఇక లేటెస్ట్ గా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి బయోపిక్ లో కూడా నిత్యా మీనన్ ను అడిగారట కానీ ఆమె ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుందని తెలుస్తుంది. మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అని చెబుతున్నా బయోపిక్ సినిమాల ఛాన్సులు వచ్చినా సరే నిత్యా మీనన్ చేయనని అంటుంది. మనసుకి నచ్చిన సినిమాలు రావట్లేదని చెబుతున్న నిత్యా మీనన్ ఇక మీదట సినిమాలు చేయడం కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష