పూరి కోసం వెయిటింగ్ : మహేష్

June 01, 2020


img

మహేష్ కేవలం హిట్టు సినిమా డైరక్టర్స్ కే ఛాన్స్ ఇస్తాడు.. ఇది ఈమధ్య పూరి జగన్నాథ్ చేసిన కామెంట్.. ఈ కామెంట్ పై మహేష్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సరిలేరు నీకేవ్వరు తర్వాత పరశురామ్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో సర్ ప్రయిజ్ ఇచ్చాడు మహేష్. ఇక పోస్టర్ రిలీజ్ అయినా సందర్భంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన మహేష్ కు పూరితో సినిమా గురించిన ప్రశ్న ఎదురైంది. 

పూరితో మీ సినిమా చూడాలని ఉందని ఓ అభిమాని అడగ్గా.. నేను కూడా వెయిటింగ్ అని చెప్పాడు మహేష్. సో మహేష్, పూరి మళ్ళీ కలిసి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ తో జనగణమన సినిమా చేయాలని ట్రై చేస్తున్నాడు మహేష్. మరి ఆ సినిమా ఎప్పుడు తెర మీదకు వస్తుందో చూడాలి. పూరి డైరక్షన్ లో మహేష్ పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు చేశాడు. హ్యాట్రిక్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేశారు. 



Related Post

సినిమా స‌మీక్ష