బాలకృష్ణ 'మోనార్క్'

May 30, 2020


img

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీ మొదలైన విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. అందులో ఒక పాత్ర అఘోరాగా భయపెడుతుందట. హీరో శ్రీకాంత్ ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా మోనార్క్ అని పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 

సినిమా కథకు తగినట్టుగా మోనార్క్ అన్నది పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఇది. సినిమాలో హీరోయిన్ గా అంజలి నటిస్తుందని అంటున్నారు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అంతేకాదు పూరి డైరక్షన్ లో సినిమా కూడా ఉంటుందని అంటున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష