ఆరెక్స్ హీరోయిన్ కు అదిరిపోయే ఆఫర్

May 29, 2020


img

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను మెప్పించిన భామ పాయల్ రాజ్ పుత్. బాలీవుడ్ లో సీరియల్స్ తీసే ఈ అమ్మడిని తెచ్చి తెలుగులో స్టార్ ను చేశాడు డైరక్టర్ అజయ్ భూపతి. ఆరెక్స్ 100 హిట్ తో పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వెంకీమామ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ లేటెస్ట్ గా కోలీవుడ్ నుండి అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. 

శంకర్, కమల్ హాసన్ కలిసి చేస్తున్న సూపర్ హిట్ మూవీ సీక్వల్ ఇండియన్ 2. ఈ సినిమాలో పాయల్ తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట శంకర్. తెలుగులో హాట్ ఇమేజ్ ఉన్న పాయల్ తో ఈ సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే పాయల్ తమిళంలో కూడా పాపులారిటీ తెచ్చుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఈ ఇయర్ రవితేజ హీరోగా చేసిన డిస్కో రాజా సినిమాలో నటించి అమ్మడు రెండు మూ డు సినిమాలకు సైన్ చేసినట్టు టాక్.  



Related Post

సినిమా స‌మీక్ష