అచ్చం సూర్య సినిమాల్లో జరిగినట్టే..!

May 29, 2020


img

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పాటుగా పాకిస్థాన్ నుండి వచ్చిన మిడతల దండయాత్ర కూడా ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. విచిత్రం ఏంటంటే ఇలాంటి విషయాలు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల్లో చర్చలు రావడం విశేషం. సూర్య హీరోగా మురుగదాస్ డైరక్షన్ లో చేసిన సెవెంత్ సెన్స్ మూవీలో వైరస్ స్ప్రెడ్ చేయడం దాన్ని నివారించేందుకు భోది ధర్మని మళ్ళీ రప్పించడం లాంటివి చూపించారు. ఇప్పుడు కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు కూడా అలాంటి మ్యాజిక్ ఒకటి జరగాలని అంటున్నారు. 

ఇక ఇదే కాకుండా మిడతల దాడి గురించి చూస్తే.. సూర్య నటించిన బందోబస్త్ సినిమాలో విలన్ తాను ఆక్యుపై చేయాలనుకున్న ఊళ్లలో పొలాల మీద మిడతల దాడి చేయిస్తాడు. దానితో పంట నష్టం వచ్చి పొలాలు ఎండిపోయి తనకు రాసిస్తారని ఆ ప్లాన్ చేస్తాడు. ప్రస్తుతం ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్య కథలు నచ్చి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని సినిమాలు చేస్తుంటే.. ఆ హీరో చేసిన సినిమాలు నిజ జీవితంలో జరిగి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక ఇదే అదునుగా సూర్య ఫ్యాన్స్ మా హీరో అసలైన స్టార్ అంటూ ఆనందపడుతున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష