స్టార్ సినిమాకు 20 కోట్ల లాస్..!

May 28, 2020


img

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా బిగిల్. అట్లీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2019లో తమిళంలో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. అయితే ఈ సినిమా చెప్పడానికి బ్లాక్ బస్టర్ అంటున్నా నిర్మాతలకు మాత్రం 20 కోట్ల లాస్ తెచ్చిందని తెలుస్తుంది. బిగిల్ నిర్మించిన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్వయంగా ఈ విషయాన్ని వెళ్లడించింది. విజయ్ హీరోగా అట్లీ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాతకు లాభాలు ఇవ్వకపోగా 20 కోట్ల లాస్ తెచ్చిందట. 

ఈ లాస్ కు కారణం సినిమాకు లెక్కకు మించి బడ్జెట్ పెట్టడమే అని అంటున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కోసం అవసరం ఉన్నా లేకపోయినా డైరక్టర్ అట్లీ మంచి నీళ్లలా నిర్మాత డబ్బులను ఖర్చు పెట్టించాడని అంటున్నారు. అయితే ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ చేసిన వ్యాఖ్యలకు విజయ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. కావాలనే విజయ్ సినిమాకు లాస్ వచ్చినట్టుగా చెబుతున్నారని. సినిమా భారీ వసూళ్లు సాధించిన విషయం మర్చిపోయారని ఇళయదళపతి ఫ్యాన్స్ ఆ ప్రొడ్యూసర్స్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష