బాలకృష్ణకు నాగబాబు వార్నింగ్.. బాధ్యత ఉండక్కర్లే

May 28, 2020


img

లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెట్టాలి.. సినిమా షూటింగ్ స్పాట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఆలోచనతో తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ పెద్దలు కొందరు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని తెలంగాణా సీఎం కె.సి.ఆర్ ప్రకటించారు. 

ఈ చర్చలకు తనని పిలవలేదని.. తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు నందమూరి బాలకృష్ణ. భూములు పంచుకునేందుకు ఈ మీటింగ్ అన్నట్టుగా మాట్లాడారు. అయితే బాలకృష్ణ మాటలను ఖండిస్తూ మెగా బ్రదర్ నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. మామూలుగానే బాలకృష్ణ అనగానే అంతెత్తున లేచే నాగబాబు ఈరోజు కూడా బాలకృష్ణ మాట్లాడింది తప్పని.. ఆ మాటలను తను వెనక్కి తీసుకోవాలని అన్నారు. అంతేకాదు సినిమా పరిశ్రమ మీద బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని.. ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. పనిలో పనిగా భూముల ప్రస్తావన రావడంతో ఆంధ్రాలో భూములు కాజేసింది ఎవరో తెలుసనీ తెలుగు దేశం పార్టీ మీద పంచ్ వేశాడు నాగబాబు. మొత్తానికి బాలయ్య మాట్లాడిన దానికి కౌంటర్ గా నాగబాబు వీడియో పెట్టడం. ఇవి రెండు సోషల్ మీడియాలో స్పీడ్ గా వైరల్ అవడం విశేషం. ఈసారి ప్రత్యక్షంగా మొదలైన ఈ గొడవ ఎక్కడికి వెళ్తుందో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష