రవితేజ 'కిలాడి'

May 28, 2020


img

ఈ ఇయర్ వచ్చిన డిస్కో రాజా సినిమాతో మరోసారి నిరాశపరిచిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా క్రాక్ అని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమధ్య వచ్చిన టీజర్ కూడా సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేసింది. క్రాక్ లో రవితేజ సరసా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. డాన్ శీను, బలుపు తర్వాత గోపీచంద్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్ లో ఆసక్తి ఏర్పడింది.  

ఇక ఈ సినిమాతో పాటుగా రమేష్ వర్మ డైరక్షన్ లో ఓ సినిమా స్టార్ట్ చేశాడు రవితేజ. ఆల్రెడీ రమేష్ వర్మ డైరక్షన్ లో వీర సినిమా తీశాడు రవితేజ, ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇక లేటెస్ట్ గా రవితేజ ఇమేజ్ కు సరిపడే కథతో సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాకు కిలాడి టైటిల్ పరిశీలణలో ఉన్నట్టు తెలుస్తుంది. నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో రవితేజ సినిమా గురించి కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయట. మరి చూస్తుంటే రవితేజ ఈ సినిమాలతో తప్పకుండా హిట్ ట్రాక్ లోకి వచ్చేలా ఉన్నాడు. క్రాక్, కిలాడి మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా వస్తున్న రవితేజ ఆశించిన ఫలితాన్ని అందుకుంటాడో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష