తమిళ భాష నేర్చుకుంటున్న హీరోయిన్

May 27, 2020


img

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న భామ రాశి ఖన్నా. స్టార్ అవకాశాలు రాకపోయినా సరే యువ హీరోలకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అయ్యింది అమ్మడు. ఇక ఈమధ్యనే తమిళ సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ భామ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ డైరక్టర్ హరి కాంబో సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాశి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటుంది. అందుకే లాక్ డౌన్ టైం లో ఓ టీచర్ ను అపాయింట్ చేసుకుని మరి తమిళం నేర్చుకుంటుంది. 

లేటెస్ట్ గా ఈ విషయాన్నీ చెబుతూ తన తమిళ ట్యూషన్ మాస్టర్ పేరు లీలా అని.. ఆమె ఇచ్చిన క్లాస్ వర్క్, హోమ్ వర్క్, క్లాస్ టెస్ట్ లతో బిజీగా ఉన్నానని ట్వీట్ చేసింది అమ్మడు. హీరోయిన్ అంటే ఏదో ఇలా వచ్చి అలా చేసి వెళ్లాం అన్నట్టు కాకుండా పాత్ర కోసం ఇంత కష్టపడటం గొప్ప విషయం. అందుకే రాశికి ఇప్పటికి మంచి అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. తెలుగులో ఎన్టీఆర్ తో మాత్రమే ఛాన్స్ అందుకున్న రాశి ఖన్నా తమిళంలో అయినా స్టార్స్ తో నటించాలని ఆశిద్ధాం. 



Related Post

సినిమా స‌మీక్ష