కెమెరా మెన్ పై పోలీస్ కేసు

May 27, 2020


img

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కెమెరా మెన్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడుపై చీటింగ్ కేసు నమోదైంది. టాలీవుడ్ ఆర్టిస్ట్ శ్రీ సుధతో వివాహిత సంబంధం పెట్టుకున్న శ్యామ్ కె నాయుడు ఆ తర్వాత తనని వదిలించుకోవాలని చూశాడంటూ శ్రీసుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. శ్రీసుధ కంప్లైంట్ ఇవ్వడమే ఆలస్యం శ్యామ్ కె నాయుడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

ఇదివరకు టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో కూడా శ్యామ్ కె నాయుడు పేరు వినిపించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా శ్రీసుధ చీటింగ్ కేసు నమోదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్జున్ రెడ్డితో పాటుగా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన శ్రీసుధ కెమెరా మెన్ చేతిలో మోసపోయినట్టు తెలుస్తుంది. చోటా తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్యామ్ కె నాయుడు పూరి డైరక్షన్ లో వచ్చిన పోకిరి, బిజినెస్ మెన్, కెమెరా మెన్ గంగతో రాంబాబు, టెంపర్ సినిమాలకు కెమెరా మెన్ గా చేశాడు.   



Related Post

సినిమా స‌మీక్ష