ఈ పోస్టర్ నిజమైతే బాగుంటుంది..!

May 27, 2020


img

సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అని ఎనౌన్స్ చేయగానే మహేష్ ఫ్యాన్స్ తమ క్రియేటివిటీ చూపించేశారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏంటి అన్నది కూడా ఒక క్లారిటీ లేదు అలాంటిది రాజమౌళి డైరక్షన్ లో రామాయణం పోస్టర్ అందులో రాముడిగా విల్లు పట్టుకుని మహేష్. అబ్బో ఫ్యాన్ మేడ్ పోస్టరే కానీ సోషల్ మీడియాని షేక్ చేసింది ఈ పోస్టర్. 

నిజంగా రాజమౌళి మహేష్ తో చేసే సినిమా రామాయణం అని అనుకునేలా.. ఇది అఫీషియల్ పోస్టర్ లా ఫ్యాన్స్ ఫీల్ అయ్యేలా చేశారు. ఈ పోస్టర్ క్రియేట్ చేసిన ఫ్యాన్ కు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ తో రాజమౌళి అల్లూరి సీతారామరాజు సినిమానే చేసేవాడు.. కానీ ఫ్యాన్స్ కోరిక మేరకే జేమ్స్ బాండ్ తరహా కథ చేస్తానని అంటున్నాడు. అయితే బాహుబలికి ముందు రాజమౌళి అల్లూరి కథను ఎలా తీస్తాడో  బాహుబలి తర్వాత మాత్రం మహేష్ తో  రాజమౌళి సినిమా చేస్తే అలాంటి సినిమా చేయాలని అంటున్నారు. ఇక రిలీజైన రామాయణం ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూసి రాజమౌళి కూడా మహేష్ తో అలాంటి సినిమా చేయాలనే ఫిక్స్ అయ్యేలా ఉంది. పోస్టర్ నిజమైతే మాత్రం సంచలనం అనేది ఆ సినిమాకు మారు పేరు అవుతుంది. 



Related Post

సినిమా స‌మీక్ష