ఇలాంటివి చేయాలంటే ఆర్జీవి తర్వాతే ఎవరైనా..!

May 26, 2020


img

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీద సినిమా తీస్తున్నాడు ఆర్జీవి. లేటెస్ట్ గా సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఎప్పుడు తీశాడో.. ఎలా తీశాడో కూడా తెలియదు కానీ కరోనా వైరస్ మీద వస్తున్న మొదటి సినిమా ఇదే అవడం విశేషం. అప్పుడే కరోనా వైరస్ గురించి ప్రకటించడం.. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి దగ్గుతుండటం..  ఆమెకు కరోనా సోకిందేమో అని మిగతా ఇంటి సభ్యులు భయపడడం.. ట్రైలర్ లో ఇలాంటి సీన్స్ తో ఆసక్తి కలిగేలా చేశాడు ఆర్జీవీ. 

ఇలాంటి టైం లో ఇలాంటి సినిమా అది కూడా ఆర్జీవీ దగ్గర నుండి రావడం.. కచ్చితంగా ఇది ఆయన మాత్రమే చేయగలడు అనిపించేలా ఉంది. ట్రైలర్ అదిరిపోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచడంలో కూడా వర్మ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. చివర్లో షూటింగ్ మొత్తం లాక్ డౌన్ టైం లోనే జరిగిందని షాక్ ఇచ్చాడు ఆర్జీవీ. మరి అదెలా సాధ్యమైంది అన్నది ఇప్పుడు అందరికి డౌట్ రేజ్ అవుతుంది.



Related Post

సినిమా స‌మీక్ష