నాని సినిమాలో సాయి పల్లవి

May 26, 2020


img

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీశ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రగంటి మొహానకృష్ణ డైరెక్షన్ లో చేసిన V రిలీజ్ కు రెడీ అవగా.. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న టక్ జగదీశ్ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత నాని రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా ఎనౌన్స్ చేశాడు. శ్యామ్ సింగ రాయ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కాకపోతే ఇప్పుడు రష్మిక ప్లేస్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. 

నాని, సాయి పల్లవి ఇద్దరు కలిసి MCA సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి అంచనాలు పెరిగాయి. టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్,  నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ఈ సినిమా ఉంటుందని టాక్. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష