రవితేజ లైన్ లో మరో సినిమా

May 26, 2020


img

డిస్కో రాజా అంచనాలను అందుకోకపోవడంతో రవితేజ కెరియర్ మరింత రిస్క్ లో పడ్డది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్ చేశాడు. అదేకాకుండా నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో సినిమా కూడా డిస్కషన్ లో ఉంది. ఇవి కాకుండా రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో కూడా సినిమా చేస్తున్నాడట రవితేజ. 

రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా నా పేరు సూర్య డిజాస్టర్ అయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా కష్టపడి చేసిన ఆ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది. ఆ తర్వాత బన్ని అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. బన్ని సినిమా హిట్టయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ వక్కంతం వంశీకి మరో ఛాన్స్ ఇవ్వలేదు. అయినా ప్రయత్నం మానుకొని వంశీ ఫైనల్ గా మాస్ రాజా రవితేజతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష