కార్తి చేయాల్సింది నాని చేశాడు.. !

May 26, 2020


img

కోలీవుడ్ హీరో కార్తి అన్న సూర్యలానే తెలుగు తమిళ భాషల్లో సత్తా చాటుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈమధ్య సూర్య కెరియర్ పరంగా వెనుక పడితే కార్తి మాత్రం వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు.  తమిళ్ హీరోల్లో తెలుగు ప్రేక్షకులు మెచ్చిన వారిలో కార్తి కూడా ఉన్నాడు. ఖైది సినిమాతో సత్తా చాటిన కార్తి త్వరలో మరో సర్ ప్రయిజ్ తో రానున్నాడు. 

రీసెంట్ గా కార్తి బర్త్ డే సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిన్ను కోరి సినిమా ఛాన్స్ మిస్ అయ్యానని చెప్పాడు కార్తి. కార్తి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నిన్ను కోరి సినిమా ప్లాన్ చేశాడు శివ నిర్వాణ. కానీ కార్తి వేరే కమిట్ మెంట్ ఉండటం వల్ల నిన్నుకోరి చేయలేకపోయాడట. కార్తి కాదన్న ఆ సినిమా నాని చేసి హిట్ కొట్టాడు. నాని, శివ నిర్వాణ కాంబోలో ఆ సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత మజిలీతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు. నిన్నుకోరి కార్తి చేసి ఉంటే అతనికి తెలుగులో మరిన్ని క్రేజీ ఆఫర్లు వచ్చేవి.


Related Post

సినిమా స‌మీక్ష