బిగ్ బాస్ నుండి పిలుపొచ్చిందా..?

May 25, 2020


img

బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్ లు పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్ కోసం ఈ టైం కల్లా హడావిడి మొదలవ్వాలి కానీ లాక్ డౌన్ వల్ల అది కాస్త వాయిదా పడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు నుండి బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అవుతుందట. 

ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాకులు కంటెస్టెంట్స్ వేట మొదలుపెట్టినట్టు టాక్. ఈసారి స్టార్ కంటెస్టెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగా జబర్దస్త్ హైపర్ ఆదికి కాల్ వెల్లిందని టాక్. జబర్దస్త్ షోలో హైపర్ ఆది పంచులు ఏ రేంజ్ లో పేలుతాయో తెలిసిందే. అదిరే అభి టీంలో జస్ట్ ఒక చిన్న పాత్ర చేసేందుకు వచ్చిన ఆది ఇప్పుడు జబర్దస్త్ కు స్టార్ కమెడియన్ అయ్యాడు. ఆది స్కిట్ అంటే ఆ పది నిముషాల స్కిట్ లో పంచులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఆడియెన్స్ లో ఆదికి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఆఫర్లు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు బిగ్ బాస్ నుండి ఆదికి కాల్ వచ్చిందని తెలుస్తుంది. ఆది ఓకే అంటే చాలు కానీ అతను అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారట. చాలాసార్లు బిగ్ బాస్ మీద తన స్కిట్ లో పంచ్ లు వేసిన ఆది ఇప్పుడు భారీ ఆఫర్ రాగానే అందుకు ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష