వెంకటేష్-నాని మల్టీస్టారర్..!

May 25, 2020


img

విక్టరీ వెంకటేష్, నాచురల్ స్టార్ నాని కలిసి సినిమా చేస్తే.. అబ్బో కాంబినేషన్ అదిరిపోతోంది కదా.. ఈ ఇద్దరు కూడా త్రివిక్రమ్ డైరక్షన్ లో చేస్తే సినిమా పక్కా సూపర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమా తర్వాత వెంకటేష్ సినిమా ఉంటుందని టాక్. 

నాని కూడా ఈ కాంబినేషన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న టక్ జగదీశ్ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా చేస్తాడని అంటున్నారు. వెంకటేష్ నాని మల్టీస్టారర్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇద్దరు హీరోలు తమ నాచురల్ నటనతో మెప్పిస్తారు కాబట్టి ఈ కాంబో సినిమా వస్తే పండుగ అన్నట్టే. 



Related Post

సినిమా స‌మీక్ష