సోలో బ్రతుకే సో బెటర్.. మొదటి సాంగ్ వచ్చింది..!

May 25, 2020


img

లాక్ డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎలాంటి సినిమా అప్డేట్ లేకుండా పోవడంతో ఆడియెన్స్ కూడా బోర్ ఫీల్ అయ్యారు. ఇక లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం.. షూటింగ్ కు త్వరలోనే పర్మిషన్ ఇస్తారని తెలియడంతో మళ్ళీ సినిమాల సందడి మొదలైంది. అందులో మొదటిగా మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా వస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని నో పెళ్లి సాంగ్ రంజాన్ సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. 

ఇక ఈ సాంగ్ లో స్పెషల్ ఏంటంటే.. మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్, దగ్గుబాటి హీరో రానా కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఇద్దరు కూడా ఈ పాటలో కనిపించి సర్ ప్రయిజ్ చేశారు. లాస్ట్ ఇయర్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో సత్తా చాటిన సాయి తేజ్ ఈసారి సోలో బ్రతుకే అంటూ సూపర్ హిట్ పై కన్నేశాడు. సాంగ్ కోసం వరుణ్, రానా \లను వాడుకున్నారు చిత్రయూనిట్. అయితే సాంగ్ ప్రోమోనే కాబట్టి వరుణ్, రానాలు ఉన్నారా లేక సినిమాలో కూడా వారు కనిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 

Related Post

సినిమా స‌మీక్ష